భారతదేశం, డిసెంబర్ 10 -- ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న రూ.1,000 కోట్ల స్టార్టప్ నిధిని ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 1998లో గూగుల్ ప్రారంభమైన తీరును ప్రస్తావించారు. 2034 నాటికి హైదరాబాద్ నుండి కనీసం 100 స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం. హైదరాబాద్‌లోని టి-హబ్‌లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ (జీఎఫ్‌ఎస్) కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగించారు.

తెలంగాణలో శక్తివంతమైన స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించడానికి హైదరాబాద్‌లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ (జీఎఫ్‌ఎస్) హబ్ ప్రారంభం భారతదేశంలో మొట్టమొదటిదన్నారు. స్టార్టప్‌లకు మద్దతు వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం, గూగుల్ కలిసి వచ్చాయని సీఎం అన్నారు. 'విజయవంతమైన వ్యవస్థను సృష్టించడానికి మేం కలిసి పని చేస్తాం. 1998లో గూగుల్ స్టార...