భారతదేశం, ఆగస్టు 1 -- స్టాక్ మార్కెట్ నేడు భారీ పతనాన్ని చవిచూసింది. ఒకానొక దశలో మార్కెట్ గ్రీన్ మార్క్ పైన ట్రేడింగ్ ప్రారంభించింది. కానీ మార్కెట్ జోరును కొనసాగించలేకపోయింది. సెన్సెక్స్ 0.72 శాతం లేదా 585.67 పాయింట్లు క్షీణించి 80,599.91 వద్ద ముగిసింది. నిఫ్టీ 203 పాయింట్లు క్షీణించి 24,565.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. శుక్రవారం నిఫ్టీ ఇంట్రాడేలో 24734.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 24535.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 81,317.51 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 80,495.57 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

సెన్సెక్స్ లోని టాప్ 30 కంపెనీల్లో 24 కంపెనీల షేర్లు నష్టపోయాయి. సన్ ఫార్మా షేర్లు 4.63 శాతం వరకు నష్టపోయాయి. అదేసమయంలో టాటా స్టీల్ షేరు 3 శాతం నష్టపోయింది. ఇన్ఫోసిస్, మారుతి, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా షేర్లు ...