భారతదేశం, జూలై 28 -- దేశీయ స్టాక్ మార్కెట్ దారుణంగా కనిపిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీలు పతనమవుతున్నాయి. సెన్సెక్స్ ఈ రోజు అంటే సోమవారం 81,299.97 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అదేసమయంలో 700 పాయింట్లు క్షీణించి 80,776.44 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 0.80 శాతం లాభంతో 24,646.60 పాయింట్ల వద్ద ముగిసింది.

సెన్సెక్స్ బీఎస్ఇ మిడ్ క్యాప్ 0.80 శాతం పడిపోయింది. 3 రోజుల్లో 1950 పాయింట్లు పడిపోయింది. అదే సమయంలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ అర శాతం క్షీణించింది. గత మూడు ట్రేడింగ్ రోజుల్లో సెన్సెక్స్ సూచీ 1950 పాయింట్లు (2.4 శాతం) పతనమైంది. అదేసమయంలో నిఫ్టీ 2.3 శాతం క్షీణించింది. దేశీయ స్టాక్ మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవిచూశారు. ఈ కాలంలో కేవలం 3 పనిదినాల్లోనే రూ.12 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సొమ్ము పోయింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క...