భారతదేశం, జూలై 22 -- కామర్స్ నుండి 12వ తరగతి పూర్తి చేసి స్టాక్ మార్కెట్ ప్రపంచంలో కెరీర్‌ను ఏర్పరచుకోవాలని చూస్తున్నారా? అయితే మీ కోసం మంచి ఆప్షన్స్ ఉన్నాయి. నేటి కాలంలో స్టాక్ బ్రోకర్ ఒక అద్భుతమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ ఎంపికగా మారుతోంది. చాలా మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు నిపుణుల సలహా తీసుకుంటున్నారు. ప్రతిదీ ఆన్‌లైన్‌లోకి వెళ్తున్న డిజిటల్ యుగంలో ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ రంగంలో యువతకు అనేక అవకాశాలు ఉంటున్నాయి.

స్టాక్ మార్కెట్, పెట్టుబడిదారుడి మధ్య లింక్‌గా పనిచేసే వ్యక్తి స్టాక్ బ్రోకర్. డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాను తెరవడం నుండి పెట్టుబడిదారుడి రోజువారీ లావాదేవీలను బ్రోకర్ నిర్వహిస్తాడు. దీనితో పాటు స్టాక్ బ్రోకర్ ప్రధాన పని ఏంటంటే తన క్లయింట్‌కు స్టాక్ మార్కెట్లో ఎప్పుడు? ఎందుకు? ఎంత పెట్టుబడి? పెట్టా...