భారతదేశం, ఏప్రిల్ 24 -- స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది. మార్కెట్ కార్యకలాపాల్లో వాడే పదాలు, వాటి అర్థాలు, కార్పొరేట్ యాక్టివిటీస్ గురించి అవగాహన ఉండడం మంచిది. అందులో భాగంగా ఈ రోజు స్టాక్ స్ప్లిట్ గురించి తెలుసుకుందాం.

స్టాక్ విభజన లేదా స్టాక్ స్ప్లిట్ అనేది సింపుల్ గా చెప్పాలంటే, ఒక సంస్థ వాటాదారులకు అదనపు షేర్లను జారీ చేయడం. సాధారణంగా షేర్ల ధర తగ్గినప్పుడు లిక్విడిటీని పెంచడానికి ఈ చర్య తీసుకుంటారు. గతంలో ఉన్న షేర్ల ఆధారంగా జారీ చేసిన మొత్తం షేర్ల సంఖ్యను నిర్ణీత నిష్పత్తిలో పెంచుతారు. అయితే, పెట్టుబడి పెట్టిన మొత్తం విలువ అలాగే ఉంటుంది. అందులో మార్పు ఉండదు.

రూ.20 ముఖ విలువ కలిగిన స్టాక్ 2:1 స్టాక్ విభజనకు గురైతే, షేరు ముఖ విలువ రూ.20 నుంచి రూ.10కి తగ్గుతుంది. అందువల్ల, స్టా...