భారతదేశం, జనవరి 8 -- బుధవారం నాటి ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా సుంకాల పెంపుపై నెలకొన్న ఆందోళనలు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశాయి. ముగింపు సమయానికి నిఫ్టీ 50 సూచీ 26,140.75 (-0.14%) వద్ద, సెన్సెక్స్ 84,961.14 (-0.12%) వద్ద స్థిరపడ్డాయి. అయితే, ప్రధాన సూచీలు స్వల్పంగా తగ్గినప్పటికీ, మిడ్-క్యాప్ విభాగంలో కొనుగోళ్ల మద్దతు లభించడం విశేషం.

ఐటీ రంగం (+1.87%), కన్స్యూమర్ డ్యూరబుల్స్ (+1.69%) అదరగొట్టాయి. ముఖ్యంగా టైటాన్ కంపెనీ మూడవ త్రైమాసిక ఫలితాల జోష్‌తో 4% పెరిగి రికార్డు స్థాయికి చేరింది. మరోవైపు ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోగా, సిప్లా షేరు 4.28% తగ్గి భారీగా నష్టపోయింది. ఇండియా విక్స్‌ (India VIX) 9.95 వద్ద ...