భారతదేశం, జనవరి 20 -- దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారుల గుండెలు దడదడలాడుతున్నాయి. సోమవారం మొదలైన అమ్మకాల ఒత్తిడి మంగళవారం (జనవరి 20) కూడా కొనసాగడంతో దలాల్ స్ట్రీట్ బేలచూపులు చూస్తోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాలు, కంపెనీల నిరాశాజనక ఫలితాలు మార్కెట్‌ను కోలుకోలేకుండా చేస్తున్నాయి.

రెండు సెషన్లలోనే సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా (1 శాతానికి పైగా) పడిపోయింది. మంగళవారం ఇంట్రాడేలో సెన్సెక్స్ 650 పాయింట్లు నష్టపోయి 82,568 స్థాయికి దిగజారగా, నిఫ్టీ కీలకమైన 25,400 మార్కును కోల్పోయి 25,350 వద్ద ట్రేడ్ అయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఏకంగా 2% పైగా పతనం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

శుక్రవారం రూ. 468 లక్షల కోట్లుగా ఉన్న బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్, నేటికి రూ. 458 లక్షల కోట్లకు...