భారతదేశం, డిసెంబర్ 26 -- భారతీయ స్టాక్ మార్కెట్లలో నిన్న గురువారం క్రిస్మస్ సందర్భంగా సెలవు. బుధవారం (డిసెంబర్ 24) నాడు అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. ఉదయం సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ, ఆ జోరును సూచీలు కొనసాగించలేకపోయాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి హెవీవెయిట్ షేర్లలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ (లాభాల స్వీకరణ) చేయడంతో సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ నష్టాల్లోకి జారుకున్నాయి.

చివరికి సెన్సెక్స్ 116 పాయింట్లు నష్టపోయి 85,408 వద్ద ముగియగా, నిఫ్టీ 35 పాయింట్ల తగ్గుదలతో 26,142 వద్ద స్థిరపడింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా స్వల్పంగా నీరసించాయి.

మార్కెట్ గమనంపై ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. పైస్థాయిలో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం వల్ల మార...