భారతదేశం, జనవరి 1 -- భారత స్టాక్ మార్కెట్ సూచీలు 2025 చివరి రోజైన డిసెంబర్ 31న లాభాలు తెచ్చిపెట్టాయి. అన్ని రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో నిఫ్టీ 50 సూచీ 190.75 పాయింట్లు (0.74%) పెరిగి 26,129.60 వద్ద ముగిసింది. అటు బీఎస్ఈ సెన్సెక్స్ సైతం 545.52 పాయింట్లు (0.64%) లాభపడి 85,220.60 మార్కును చేరుకుంది.

"2025లో కన్సోలిడేషన్ తర్వాత, 2026లో మార్కెట్ స్థిరమైన వృద్ధిని సాధిస్తుందని మేము భావిస్తున్నాం. కార్పొరేట్ లాభాల పెరుగుదల, ప్రైవేట్ రంగ పెట్టుబడులు పుంజుకోవడం, ప్రభుత్వ విధానాల మద్దతు మార్కెట్‌కు సానుకూలంగా మారనున్నాయి" అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా వివరించారు. కొత్త ఏడాది ఆరంభంలో గ్లోబల్ మార్కెట్లకు సెలవులు ఉండటం వల్ల వాల్యూమ్ తక్కువగా ఉండొచ్చని, అయితే ఎంపిక చేసిన స్టాక్స్‌లో కొనుగోళ్లు పెరగవచ...