భారతదేశం, జూలై 31 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాలతో ఓపెన్​ అయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ దాదాపు 800 పాయింట్లు పడింది. నిఫ్టీ50 24,650 లెవల్స్​ దిగువన ఓపెన్​ అయ్యింది. బీఎస్​ఈ మిడ్​క్యాప్​, స్మాప్​క్యాప్​ సూచీలు ప్రారంభంలో 2శాతం మేర పతనమయ్యాయి. భారత్​పై 25శాతం సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్​ ప్రకటించడంతో దేశీయ స్టాక్​ మార్కెట్​లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.

ఇక లేటెస్ట్​ ట్రేడింగ్​ సెషన్​లో స్టాక్​ మార్కెట్​లు తెరుచుకున్న 10 నిమిషాల వ్యవధిలో మదుపర్లు ఏకంగా రూ. 3లక్షల కోట్లు నష్టపోయారు! బీఎస్​ఈ లిస్టెట్​ కంపెనీల మార్కెట్​ క్యాపిటల్​ రూ. 452 లక్షల కోట్ల నుంచి రూ. 449లక్షల కోట్లకు పడిపోయింది.

80,696 వద్ద ఓపెన్​ అయిన బీఎస్​ఈ సెన్సెక్స్​ ఉదయం 9:30 నిమిషాల ప్రాంతంలో 479 పాయింట్ల నష్టంతో 81,002 వద్ద ట్రేడ్...