భారతదేశం, డిసెంబర్ 8 -- డిసెంబర్ 8, సోమవారం నుంచి, ఈక్విటీ డెరివేటివ్స్ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) విభాగంలో మార్కెట్ కొత్తగా 'ప్రీ-ఓపెన్ సెషన్'ను ప్రారంభించనుంది. ఈ కొత్త విధానం వ్యక్తిగత స్టాక్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఫ్యూచర్స్ రెండింటికీ వర్తిస్తుందని నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ) తెలిపింది.

ఎన్​ఎస్​ఈ సమాచారం ప్రకారం, స్టాక్​ మార్కెట్​లో ఈ ప్రీ-ఓపెన్ సెషన్ 15 నిమిషాల పాటు, అంటే ఉదయం 9:00 గంటల నుంచి 9:15 గంటల వరకు 'కాల్ ఆక్షన్' పద్ధతిలో జరుగుతుంది.

15 నిమిషాల సెషన్‌లో మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయి.

సమయం: ఉదయం 9:00 గంటల నుంచి 9:08 గంటల వరకు.

ఏం చేయవచ్చు?: ఈ సమయంలో ట్రేడర్లు తమ ఆర్డర్లను సమర్పించవచ్చు, మార్చవచ్చు లేదా రద్దు చేయవచ్చు కూడా.

ముఖ్య గమనిక: 7వ నిమిషం నుంచి 8వ నిమిషం మధ్యలో, సిస్టమ్ ర్యాండమ్లీ టైమ్డ్​ క్లోజర్​ని అమలు చేస్తు...