భారతదేశం, ఏప్రిల్ 25 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు నష్టపోయాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 315 పాయింట్లు పడి 79,801 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 82 పాయింట్లు కోల్పోయి 24,247 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 169 పాయింట్లు పడి 55,201 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 8,250.53 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 534.54 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఏప్రిల్​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 5,127.59 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 18,709.62 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 155 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కార...