భారతదేశం, ఆగస్టు 20 -- మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య పెరుగుదలను నమోదు చేసి లాభాలతో ముగిసింది. నేటి ట్రేడింగ్‌లోనూ కొన్ని స్టాక్స్ మీద ఫోకస్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. రామ్‌కో సిమెంట్స్, నాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్, లాయిడ్స్ మెటల్, ఇండియన్ ఆయిల్ షేర్లు వార్తల కారణంగా పెట్టుబడిదారుల దృష్టిలో ఉంటాయి. ఈ స్టాక్‌లు చర్చనీయాంశంగా ఉన్నాయి. ఉత్పత్తి సామర్థ్య విస్తరణ, అంతర్జాతీయ వాణిజ్యం, బొగ్గు గనుల బిడ్డింగ్, స్థిరమైన విమాన ఇంధన సరఫరా వంటి ముఖ్యమైన చర్యలు ఈ కంపెనీలు తీసుకున్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కంపెనీ సంవత్సరానికి 200 మిలియన్ టన్నుల(MTPA) ఉత్పత్తి సామర్థ్యాన్ని దాటుతుందని అల్ట్రాటెక్ సిమెంట్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని కంపెనీ FY27కి ముందే నిర్దేశించుకుంది. కానీ అది ఒక సంవత్సరం ముం...