భారతదేశం, ఆగస్టు 21 -- జీఎస్టీలో మార్పుల వార్తలు, భారతదేశ క్రెడిట్ రేటింగ్‌లో అప్‌గ్రేడ్‌లాంటి వాటితో భారతీయ ఈక్విటీలు వరుసగా నాలుగో సెషన్‌లో విజయ పరంపరను కొనసాగించాయి. ఇది పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను పెంచింది. సెన్సెక్స్ 371 పాయింట్లు లేదా 0.46 శాతం పెరిగి 81,644.39 వద్ద, నిఫ్టీ 104 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 24,980.65 వద్ద ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు బెంచ్‌మార్క్‌ను అధిగమించి 1 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ 50 ఇండెక్స్ 50-డీఈఎంఏ రెసిస్టెన్స్ 24,815 స్థాయిలకు ఎగువన ముగియడంతో భారత స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడిందని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా అభిప్రాయపడ్డారు. భారత స్టాక్ మార్కెట్‌పై బగాడియా మాట్లాడుతూ.. '25,100 పైన నిర్ణయాత్మక బ్రేక్అవుట్ దలాల్ స్ట్రీట్‌లో కొత్త బుల్ ట్రెండ్‌ను ప్ర...