భారతదేశం, జూన్ 27 -- థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, క్షణక్షణం ఉత్కంఠను పంచే వెబ్ సిరీస్ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. అందరూ అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఈ రోజు (జూన్ 27) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కు ముందు మేకర్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఫస్ట్ ఎపిసోడ్ లోని తొలి 6 నిమిషాలను ముందుగానే స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

స్క్విడ్ గేమ్ పోటీదారులను షాక్ కు గురి చేసేలా.. 456వ ప్లేయర్ గి హున్ (లీ జంగ్-జే) బతికే ఉన్నాడని వెల్లడించారు. 456వ ప్లేయర్ పునర్జన్మ పొందాడు. నెట్‌ఫ్లిక్స్ ట్యూడమ్ పంచుకున్న వీడియోలో 456వ ప్లేయర్ బాక్స్ లో నుంచి లేచి నిలబడటం చూపించారు. గత సీజన్‌లో తన సన్నిహిత స్నేహితుడిని కోల్పోయిన తర్వాత, అతను ఫ్రంట్ మ్యాన్‌ను సవాలు చేశాడు. ...