భారతదేశం, జనవరి 20 -- స్కోడా ఆటో ఇండియా తన పాపులర్ మోడల్ 'కుషాక్'లో కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. పాత మోడల్‌తో పోలిస్తే మరింత క్లీన్ డిజైన్, ప్రీమియం లుక్, హై-టెక్ ఫీచర్లతో ఈ కారును అప్‌గ్రేడ్ చేశారు. మెకానికల్‌గా ఇంజిన్‌లో పెద్ద మార్పులు లేకపోయినా, ఫీచర్ల విషయంలో మాత్రం స్కోడా భారీ మార్పులే చేసింది.

వచ్చే నెలలో (మార్చిలో) ఈ కారు అధికారికంగా లాంచ్ కానుంది. ఈలోపే కొనుగోలు చేయాలనుకునే వారి కోసం కంపెనీ ప్రీ-బుకింగ్స్ (Pre-bookings) ప్రారంభించింది.

విజువల్ ట్రీట్‌లా ఉండేలా స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ను రూపొందించారు.

లైటింగ్: ఇప్పుడు అన్ని వేరియంట్లలో ఎల్‌ఈడీ (LED) హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్ స్టాండర్డ్‌గా వస్తాయి. వెనుక వైపు సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు కారుకు మరింత ప్రీమియం...