Hyderabad, జూన్ 26 -- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా డ్రగ్స్ కు వ్యతిరేకంగా గళమెత్తాడు. అంతర్జాతీయ డ్రగ్స్, అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన రైజింగ్ తెలంగాణ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి అతడు పాల్గొన్నాడు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా అందరం రైజింగ్ తెలంగాణకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చాడు.

డ్రగ్స్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం గురువారం (జూన్ 26) ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించింది. దీనికి రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా వచ్చాడు. అతనితోపాటు సీఎం రేవంత్ రెడ్డి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, విజయ్ దేవరకొండ, ప్రొడ్యూసర్ దిల్ రాజులాంటి వాళ్లు కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడాడు.

"రైజింగ్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఇలాంటి అవగాహన కార్యక్రమం నిర్వహించినందుకు, దీనికి హాజరైనందుకు సీఎం ...