భారతదేశం, ఆగస్టు 28 -- మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్ నగరంలోని కాథలిక్ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పిల్లలు మరణించగా, 17 మంది పిల్లలు, మరికొందరు పెద్దలు గాయపడ్డారు. మెుత్తం 20 మందికిపైగా ఆసుపత్రిపాలయ్యారు. మిన్నియాపాలిస్ కాథలిక్ పాఠశాలలో బుధవారం ఉదయం కాల్పులు జరిగాయని మిన్నెసోటా గవర్నర్ తెలిపారు. ఈ కాల్పులను భయంకరమైనది అని గవర్నర్ టిమ్ వాల్జ్ అభివర్ణించారు.

మరణించినవారు 8, 10 సంవత్సరాల వయస్సు గల పిల్లలు. కాల్పులు జరిపిన వ్యక్తికి పెద్దగా నేర చరిత్ర లేదు. అతడిని రాబిన్ వెస్ట్‌మన్‌గా గుర్తించారు. 20 ఏళ్ల వరకు ఉంటాయని చెబుతున్నారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

దాదాపు 395 మంది విద్యార్థులు చద...