భారతదేశం, జూలై 25 -- రాజస్థాన్​లో శుక్రవారం ఉదయం విషాదరకర సంఘటన జరిగింది. ఝలావర్​లోని ఓ స్కూల్​ భవనం పైకప్పు కూలిపోయింది. ఘటనాస్థలానికి పరుగులు తీసిన అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

కాగా పలు మీడియా నివేదికల ప్రకారం.. రాజస్థాన్​లో​ స్కూల్​ భవనం కూలిన ప్రమాదంలో ఇప్పటివరకు నలుగురు మరణించారు. శిథిలాల కింద మరో 40మంది చిక్కుకున్నారు.

"ఝలావర్​లోని పిప్లోడి ప్రైమరీ స్కూల్​ పైకప్పు ఉదయం 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో కూలిపోయింది. చాలా మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. కలెక్టర్​ ఘటనాస్థలానికి చేరుకున్నారు," అని సంబంధిత అధికారులు మీడియాకు చెప్పారు.

రాజస్థాన్​లో స్కూల్​ భవనం పైకప్పు కూలిన సమయంలో.. లోపల 40మంది విద్యార్థులతో పాటు టీచర్లు- సిబ్బంది కూడా ఉన్నారు.

భారీ శబ్ధం వినిపించిన తర్వాత స్థానికులు ఘటనాస్థలం వద్దకు పరుగులు తీశారు. కానీ అక్కడ ...