Hyderabad, ఏప్రిల్ 13 -- ఎండాకాలంలో ఎంత జాగ్రత్త పడ్డా చర్మం ట్యాన్ అవుతూనే ఉంటుంది. సూర్యుడి నుంచి విడుదల అయ్యే హానికరమైన యూవీ కిరణాల కారణంగా చర్మం కాంతిని కోల్పోయి డల్‌గా, నిర్జీవంగా తయారవుతుంది. ఎప్పటికప్పుడు దీన్ని తొలగించకపోతే చర్మం రంగు మారి నల్లగా కనిపిస్తుంది. ఇలా జరగడకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు స్కిన్ ట్యానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా బయట తిరిగే వాళ్లు, పీక్ అవర్స్ అంటే 11నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు ఎండలో సమయాన్ని గడిపినవాళ్లు ఎప్పటికప్పుడు స్కిన్ ట్యాన్ తొలగించుకోవాలి. ఇందుకు మార్కెట్లోకి క్రీములకు బదులుగా సహజమైన పదార్థాలైతే మరింత మంచిది. అలాంటి సహజమైన స్క్రబ్ లలో ఓట్ మీల్ స్క్రబ్ ముందుంటుంది. ఓట్ మీల్ స్క్రబ్ ఎలా తయారు చేయాలి?దీన్ని ఎలా ఉపయోగించాలి తెలుసుకుందాం రండి.

ఓట్ మీల్ స్క్రబ్ ఉపయోగించడం వల్ల క...