భారతదేశం, అక్టోబర్ 12 -- నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించడానికి రూపొందించిన ఏపీ ఎక్సైజ్‌సురక్షా యాప్‌‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో కల్తీ మద్యం వైసీపీ ప్రభుత్వం నుంచి వారసత్వ సంపదగా వచ్చిందని చంద్రబాబు విమర్శించారు. నకిలీ మద్యం కేసులో విస్తూపోయే విషయాలు బయటకు వస్తున్నాయన్నారు. కానీ ఇప్పుడు వాటిపై తాను మాట్లాడదలుచుకోలేదన్నారు.

'కల్తీ మద్యంపై విచారణకు జీవీజీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేశాం. నకిలీ మద్యంపై సిట్‌ బృందంతో మొత్తం ప్రక్షాళన చేస్తాం. సిట్‌లో రాహుల్‌దేవ్‌ శర్మ, కె.చక్రవర్తి, మలికా గార్గ్‌ సభ్యులుగా ఉంటారు.' అని చంద్రబాబు అన్నారు.

ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్‌తో నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించవచ్చని సీఎం చంద్రబాబు చెప్పారు. కేవలం స్కాన్ చేస్తే చాలు సీసాకు సంబంధించిన ...