భారతదేశం, నవంబర్ 17 -- సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో 42 మంది భారతీయ యాత్రికులు ఉన్నారు. వారిలో 16 మంది తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందినవారు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున మక్కా నుండి మదీనాకు భక్తులను తీసుకెళ్తున్న ప్యాసింజర్ బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

మెహదీపట్నంలో ఓ ఏజెన్సీ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈనెల 9వ తేదీన హైదరాబాద్ నుంచి ఉమ్రాకు వెళ్లారు. విజయవంతంగా మక్కా యాత్ర పూర్తి చేసుకున్నారు. అయితే మదీనాకు వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదీనాకు సుమారు 25 కిలోమీటర్లు దూరంలో బస్సు, డీజిల్ ట్యాంకర్ ఢీ కొన్నాయి.

మృతుల్లో 16 మంది తెలంగాణకు చెందినవారు ఉన్నారు. వారి పేర్లు : రహమత్‌ బీ, రహీమున్నీసా, షెహనాజ్‌ బేగం, గౌసియా బేగం, మహ్మద్‌ మౌలానా, కదీర్‌ మహ్మద్, షోయబ్‌ మహ్మద్, మస్త...