భారతదేశం, నవంబర్ 17 -- సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. వారంతా హైదరాబాద్‌కు చెందినవారేనని అధికారులు స్పష్టతనిచ్చారు. సోమవారం తెల్లవారుజామున మక్కా నుండి మదీనాకు భక్తులను తీసుకెళ్తున్న ప్యాసింజర్ బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

మెహదీపట్నంలో ఓ ఏజెన్సీ ద్వారా వారంతా టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈనెల 9వ తేదీన హైదరాబాద్ నుంచి ఉమ్రాకు వెళ్లారు. విజయవంతంగా మక్కా యాత్ర పూర్తి చేసుకున్నారు. అయితే మదీనాకు వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదీనాకు సుమారు 25 కిలోమీటర్లు దూరంలో బస్సు, డీజిల్ ట్యాంకర్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది, మరో కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 46 మందిలో మహమ్మద్ అబ్దుల్ షోయబ్ అనే యువకుడు మాత్రమే బతికాడు.

మల్లేపల్లి బజార్‌ఘాట...