భారతదేశం, నవంబర్ 17 -- సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎక్కువగా హైదరాబాద్‌ వాసులు ఉన్నారు. మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది, మరో కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రయాణికుల్లో మహమ్మద్ అబ్దుల్ షోయబ్ అనే యువకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. మక్కా యాత్రకు వెళ్లిన ప్రయాణికులు చనిపోయవడం బాధకరమని అన్నారు. బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందినవారు చనిపోయారని తెలిపారు. హైదరాబాద్ నుంచి వెళ్లినవారిలో మహమ్మద్ షోయబ్ అనే వ్యక్తి మాత్రమే ప్ర...