భారతదేశం, మే 14 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య కొత్తగా పలు ఒప్పందాలు కుదిరాయి. అక్కడ భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించానని కూడా ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. అయితే, ఇవన్నీ కాకుండా, ట్రంప్ సౌదీ పర్యటన సందర్భంగా మరో అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను పోస్ట్ చేసిన 24 గంటల్లోనే 15 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రియాద్ లో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ తో సమావేశమయ్యారు. అయితే ఈ భేటీకి సంబంధించిన క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమెరికా, సౌదీ యూజర్ల మధ్య అసాధారణ చర్చకు దారితీసింది. వైరల్ గా మారిన ఆ వీడియోలో.. ట్రంప్, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ల భేటీ సందర్భంగా ఇద్దరు నేతలకు ప్రత్యక కప్ లో ఒక డ్రింక్ ను సర్వ్ చేశారు. అయితే, ఆ పానీయాన...