భారతదేశం, నవంబర్ 17 -- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనాకు వెళుకున్న ఉమ్రా యాత్రికులతో కూడిన బస్సు.. ఓ డీజిల్​ ట్యాంకర్​ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 45 మంది హైదరాబాద్ యాత్రికులు సజీవ దహనం అయ్యారు! స్థానిక మీడియా నివేదికల ప్రకారం, మరణించిన వారంతా హైదరాబాదీలే.

తెలంగాణ సమాచార సాంకేతిక శాఖ మంత్రి డీ. శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఈ బస్సు ప్రమాదంలో చనిపోయిన వారు హైదరాబాద్ నివాసితులేనని ప్రాథమిక సమాచారం అందినట్లు తెలిపారు. వీరంతా మాలెపల్లిలోని బజార్‌ఘాట్ ప్రాంతానికి చెందిన వారని, మృతుల వివరాలను అధికారులు ఇంకా ధృవీకరిస్తున్నారని ఆయన చెప్పారు.

బాధితుల బంధువు ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బృందం నవంబర్ 9న హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లింది. మక్కాలో ఉమ్రా ప్రార్థనలు పూర్తి చేసుకుని మదీనాకు తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచే...