Hyderabad, ఏప్రిల్ 20 -- Malavika Mohanan About Navel Show In South Films: మాస్టర్ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన మలయాళ బ్యూటి మాళవిక మోహనన్. రజనీకాంత్ పెట్టా, ధనుష్ మారన్, విక్రమ్ తంగళాన్ సినిమాల్లో నటించి అలరించింది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న రాజా సాబ్ మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది మాళవిక మోహనన్.

అయితే, సౌత్ సినిమాల్లో బొడ్డు చూపించడానికి చాలా ఇష్టపడతారని, నాభి వ్యామోహం ఎక్కువగా ఉంటుందని రీసెంట్‌గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మాళవిక మోహనన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. హౌటర్‌ఫ్లై ఇంటర్వ్యూలో ఇటీవల బ్యూటిఫుల్ మాళవిక మోహనన్ పాల్గొంది. ఇందులో "దక్షిణాది సినిమాల్లో నాభి వ్యామోహం (Navel Obsession) ఎక్కువగా ఉంటుందనేది నిజమేనా" అని హోస్ట్ అడిగారు.

దానికి నిజమే అని సమాధానం చెప్పిన మాళవిక మోహనన్ సౌత్ సినిమాల్లో బొడ్డు చూపించడానికి ఎక్కువ ...