భారతదేశం, అక్టోబర్ 27 -- నటి రమ్యకృష్ణ ఇటీవల జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జీ5 (Zee5) టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్ము రా'కు వచ్చింది. ఆ షోలో తమ స్నేహితురాలు, దివంగత నటి సౌందర్య (Soundarya) గురించి మాట్లాడేటప్పుడు రమ్యకృష్ణ భావోద్వేగానికి లోనై కంట తడి పెట్టింది. అమ్మోరు, నరసింహ వంటి చిత్రాల షూటింగ్ సమయంలోని జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకుంది.

జగపతి బాబు తన జయమ్ము నిశ్చయమ్ము రా షోలో రమ్యకృష్ణతో మాట్లాడుతూ.. "మన ఇద్దరికీ ఉమ్మడిగా ఉన్న ఒక స్నేహితురాలి గురించి మాట్లాడాలనుకుంటున్నాను" అని చెప్పాడు. మొదట్లో ఉత్సాహంగా కనిపించిన రమ్యకృష్ణ.. తర్వాత సౌందర్య కనిపించగానే షాక్ తిన్నట్లుగా అనిపించింది. 1999లో వచ్చిన హిట్ మూవీ నరసింహలో తనతోపాటు నటించిన సౌందర్య క్లిప్‌ను చూసిన వెంటనే ఆమె కళ్లలో నీళ్లు తిరగడం మొదలైంది. ఆ వెంటనే ఆమె కళ్లలో నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి...