భారతదేశం, ఏప్రిల్ 10 -- ఇకపై అమెరికాలో వీసా లేదా పర్మినెంట్ రెసిడెన్సీ(గ్రీన్ కార్డు) పొందాలనుకునే వారు సోషల్ మీడియాలో చేసే ప్రతి పోస్ట్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో యూదులకు వ్యతిరేకంగా ఎవరైనా రాస్తే వీసా లేదా గ్రీన్ కార్డును తిరస్కరించవచ్చని లేదా ఇప్పటికే జారీ చేసిన వీసాను రద్దు చేయవచ్చని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) అధికారికంగా ప్రకటించింది.

ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ప్రభుత్వం ప్రకటించిన గ్రూపుల మద్దతు ఉన్న అభిప్రాయాలను పంచుకునే సోషల్ మీడియా ఖాతాలను ఇకపై సమీక్షిస్తామని యూఎస్సీఐఎస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. హమాస్, హిజ్బుల్లా, హౌతీ తిరుగుబాటు సానుభూతిపరులను నిశితంగా పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే ఈ సంస్థలను అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది....