భారతదేశం, నవంబర్ 15 -- జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితాలపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో ఉద్యమం చేస్తున్నారు తప్ప గ్రౌండ్ లో చేయలేదన్నారు. అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటేనే. ప్రతిపక్ష పార్టీ ఏ స్థాయిలో పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. కృష్ణార్జునుల్లా(కేటీఆర్ - హరీశ్ రావు) సోషల్‌ మీడియాలో గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ లేదని విమర్శలు గుప్పించారు.

ఇవాళ మెదక్ లో మీడియాతో మాట్లాడిన కవిత. జూబ్లీహిల్స్‌ ఎన్నికలో కుట్రలు కూడా జరిగాయని వ్యాఖ్యానించారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని చెబుతానని చెప్పారు. ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అనుకున్న స్థాయిలో పని చేయలేదనేది స్పష్టంగా కనిపించిందన్నారు. క్షేత్రస్థాయిలో పెద్దగా పని చేయలేదన్నారు. ప్రజల కోరిక మేరకు బీఆర్ఎస్ పోరాడితే. ఫలితం మరోలా ఉండేందని అభిప్రాయపడ్డారు...