భారతదేశం, జనవరి 9 -- మెగా డాటర్, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన 'కమిటీ కుర్రోళ్లు' చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్ చేశారు. ఇప్పుడు జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో.. నిహారిక త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాతగా మరో సినిమాను నిర్మిస్తున్నారు.

ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో నిహారిక కొణిదెల క‌లిసి నిర్మిస్తోన్న చిత్రానికి 'రాకాస' అనే టైటిల్ ఖ‌రారు చేశారు. రాకాస టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు మేకర్స్. అలాగే, రాకాస సినిమాను ఏప్రిల్ 3న విడుద‌ల చేయటానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

'రాకాస‌' చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ ఈ చిత...