భారతదేశం, జూలై 4 -- బిగ్‌బాస్ సీజ‌న్ 8 ర‌న్న‌ర‌ప్ గౌత‌మ్ కృష్ణ సోలో బాయ్ మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీలో ర‌మ్య ప‌సుపులేటి, శ్వేత అవ‌స్థి హీరోయిన్లుగా న‌టించారు. న‌వీన్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీని సెవెన్‌హిల్స్ స‌తీష్ నిర్మించారు. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే..

కృష్ణ‌మూర్తిది (గౌత‌మ్ కృష్ణ‌) మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం. త‌ల్లిదండ్రులు క‌ష్ట‌ప‌డి అత‌డిని ఇంజినీరింగ్ చ‌దివిస్తుంటారు. కాలేజీలో ప్రియ (ర‌మ్య ప‌సుపులేటి) అనే అమ్మాయిని కృష్ణ‌మూర్తి ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లిచేసుకోవాల‌ని అనుకుంటాడు. గొప్పింటి అమ్మాయి అయిన ప్రియ... కృష్ణ‌మూర్తి అవ‌మానిస్తుంది.

అత‌డికి బ్రేక‌ప్ చెప్పి వెళ్లిపోతుంది. ప్రియ దూర‌మైన బాధ‌లో తాగుడుకు బానిస‌గా మారిపోతాడు కృష్ణ‌...