భారతదేశం, నవంబర్ 9 -- టూరిస్టులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పేసింది. సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం షురూ అయింది. ఇందులో భాగంగా శనివారం తెలంగాణ టూరిజం లాంచీని ప్రారంభించగా 65 మంది ప్రయాణికులు శ్రీశైలంకు ప్రయాణించారు. పర్యాటక శాఖ అధికారులు జెండా ఊపి లాంచీని ప్రారంభించారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ తీరంలోని సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ జర్నీ ఉంటుంది. వారానికి మూడు సార్లు ఈ ఆపరేషన్ ఉంటుంది. మంగళవారం, గురువారం, శనివారాల్లో ఉదయం 9 గంటలకు లాంచీ సోమశిల నుంచి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

కృష్ణమ్మ ఒడిలో, న‌‌‌‌‌‌‌‌ల్లమ‌‌‌‌‌‌‌‌ల ప‌‌‌‌‌‌‌‌చ్చద‌‌‌‌‌‌‌‌నం అందాలను వీక్షిస్తూ కృష్ణా అలలపై జర్నీ కొనసాగుతుంది. ఈ అద్భుతమైన జర్నీ. కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆపరేట్ చేయరు. కృష్ణా ...