భారతదేశం, నవంబర్ 9 -- ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో మెుంథా తుపాను వల్ల జరిగిన నష్టాలను అంచనా వేయడానికి ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం సోమ, మంగళవారాల్లో పర్యటిస్తోంది. హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలోని బృందం (IMCT) తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి నష్టాల పరిధిని అంచనా వేస్తుంది.

'నష్టాలను పరిశీలించడానికి, ప్రభావిత కుటుంబాలతో నేరుగా సంభాషించడానికి కేంద్ర బృందం రెండు రోజుల పాటు ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తుంది.' అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖార్ జైన్ తెలిపారు.

ప్రఖార్ జైన్ ప్రకారం, సోమవారం టీమ్-1 బాపట్ల జిల్లాను, టీమ్-2 కృష్ణ, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాలను సందర్శిస్తాయి, మరుసటి రోజు ఈ బృందాలు ప్రకాశం, కోనసీమ జిల్లాలను పర్యటిస్తాయని తెలిపారు. కేంద్ర బృందంలో వ్యవసాయం...