భారతదేశం, ఆగస్టు 3 -- ఓటీటీలోకి మరో ఒరిజినల్ సిరీస్ రాబోతోంది. సోనీ లివ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'కోర్టు కచేరీ' స్ట్రీమింగ్ కు రెడీ అయింది. కొడుకును ఫేమస్ లాయర్ గా చూడాలనుకునే తండ్రి కల, కెనడా వెళ్లాలనుకునే ఆ కొడుకు ఆరాటం అనే ఇంట్రెస్టింగ్ లైన్ తో ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సిరీస్ ట్రైలర్ ఆసక్తికరంగా సాగుతోంది.

సోనీ లివ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'కోర్టు కచేరీ' (Court Kacheri) స్ట్రీమింగ్ కు వేళైంది. ఈ సిరీస్ ఆగస్టు 13 నుంచి సోనీ లివ్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ కోర్టు డ్రామా సిరీస్ ట్రైలర్ రిలీజైంది. ఫన్నీగా ఉంటూనే తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్, కోపం తదితర అంశాలను చూపిస్తోంది.

కోర్టు కచేరీ ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ ఓటీటీ సిరీస్ పై అంచనాలు పెంచేలా ఉంది. తన కొడుకును ఫేమస్ లాయర్ ను చేయాలనే అప్పట...