భారతదేశం, మే 22 -- సొంత రాష్ట్రానికి బదిలీ కావాలని మూడేళ్లకు పైగా ఎదురు చూశారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించి కర్ణాటక నుంచి తెలంగాణకు బదిలీ అయ్యింది. సంతోషంతో కుటుంబ మొత్తం దైవ దర్శనానికి వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. వారిలో కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ కుటుంబం ప్రాణాలు కోల్పోయారు.

కర్ణాటకలోని విజయపుర జిల్లా బసవనబాగేవాడి తాలూకా మనగోళి సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వారిని గద్వాల జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో బ్యాంక్‌ మేనేజర్‌ భాస్కర్‌ కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

గద్వాల జిల్లాకు చెందిన టి.భాస్కర్ మొదట గద్వాల కెనరా బ్యాంకులో విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ప్రమోషన్‌పై మేనేజర్‌ హోదాలో కర్ణాటకలోని విజయపురకు బదిలీ అయ్యారు. ...