భారతదేశం, ఆగస్టు 30 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆర్థిక విధానాల్లో భాగంగా విధించిన కీలక టారిఫ్‌లు చాలా వరకు చట్టవిరుద్ధం అని అమెరికాలోని ఓ అప్పీల్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది! దీనితో ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. అయితే, ఈ తీర్పు వచ్చినప్పటికీ, ఈ టారిఫ్‌లు అక్టోబర్ 14 వరకు అమలులో ఉంటాయి. అప్పటిలోగా సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్ ప్రభుత్వానికి సమయం ఉంది.

వాషింగ్టన్ డీసీలోని అమెరికా ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు తన తీర్పులో.. ట్రంప్ అత్యవసర అధికారాల చట్టం కింద టారిఫ్‌లు విధించడం ద్వారా తన అధికార పరిధిని అతిక్రమించారని స్పష్టం చేసింది.

రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం.. కోర్టు తన ఉత్తర్వుల్లో ఇలా పేర్కొంది: "ఒక జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు అనేక చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం అధ్య...