భారతదేశం, జూలై 14 -- మన లివర్ (కాలేయం) ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎందుకంటే అది నిశ్శబ్దంగా దెబ్బతింటుందని, చివరికి పెద్ద సమస్యగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తరచుగా ఎటువంటి లక్షణాలు చూపించకుండానే కాలేయం లోపల కొవ్వు పేరుకుపోతుందని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పాలప్పన్ మాణికం వెల్లడించారు. ఫ్యాటీ లివర్‌గా పిలిచే ఈ అనారోగ్యాన్ని ఎలా తగ్గించుకోవచ్చో, అసలు ఫ్యాటీ లివర్ ఎలా వస్తుందో ఆయన తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరంగా పంచుకున్నారు.

"ఫ్యాటీ లివర్ సైలెంట్‌గా మొదలై, కాలక్రమేణా పెరుగుతూ పోతుంది. దీన్ని నివారించుకోకపోతే కాలేయంలో వాపు, మచ్చలు, చివరకు సిర్రోసిస్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. విష పదార్థాలకు దూరంగా ఉండటం, పొట్ట చుట్టూ కొవ్వు పెరగకుండా చూసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా కాలేయాన్ని రక్షించ...