Hyderabad, జూలై 3 -- కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య రిలీజైన థగ్ లైఫ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెట్టింది. అది కూడా ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా బుధవారం (జులై 2) అర్ధరాత్రి దాటగానే స్ట్రీమింగ్ మొదలైంది.

థగ్ లైఫ్ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఒరిజినల్ అయిన తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సౌత్ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"ఇది రంగరాయ శక్తివేల్, యముడి మధ్య పోటీ. థగ్ లైఫ్ మూవీని ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లో చూడండి" అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది. నిజానికి శుక్రవారం (జులై 4) నుంచి ఈ...