Hyderabad, జూన్ 20 -- తెలుగు మూవీ ఒక బృందావనం ఓటీటీలోకి వచ్చేసింది. గత నెల 23న థియేటర్లలో రిలీజైన ఈ ఎమోషనల్ డ్రామా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే ఈ విషయం స్ట్రీమింగ్ మొదలైన తర్వాతగానీ ఆ ఓటీటీ వెల్లడించలేదు. ఓ అబ్బాయి, ఓ అమ్మాయి, మరో చిన్నారి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఓటీటీలోకి శుక్రవారం (జూన్ 20) అడుగుపెట్టిన మూవీ ఒక బృందావనం. ఈ సినిమాను ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తోంది. ఆ విషయాన్ని ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"కొత్త వైబ్స్. కొత్త ముఖాలు. స్వచ్ఛమైన భావోద్వేగాలు. ఒక బృందావనం ఇప్పుడు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది" అనే క్యాప్షన్ తో ఈటీవీ విన్ ఈ విషయం తెలిపింది. ఈ సందర్భంగా మూవీలోని ప్రధాన క్యారెక్టర్లు ఉన్న పోస్టర్ ను కూడా పోస్ట్ చేసింది.

ఒక బృందావనం మూవీ మే 23న థి...