Hyderabad, జూలై 4 -- థ్రిల్లర్ మూవీ అభిమానుల కోసం ఈ వీకెండ్ మరో సినిమా సిద్ధంగా ఉంది. ఇదో హిందీ మూవీ. మే 23న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా పేరు పుణె హైవే. ఐఎండీబీలో మంచి రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందని భావించారు.

ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే థ్రిల్లర్ మూవీ పుణె హైవే శుక్రవారం (జులై 4) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మే 23న సినిమా థియేటర్లలో రిలీజ్ కాగా.. సుమారు 40 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ అయింది.

థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు సడెన్ గా ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎలాంటి ముందస్తు సమాచారం లేదు.

పుణె హైవే ఓ హిందీ థ్రిల్లర్ మూవీ. జిమ్ సర్బ్, అమిత్ సాధ్ లాంటి వాళ్లు ఇందులో నటించారు. భార్గవ కృష్ణ, రాహుల్ కన్హ ఈ సిన...