భారతదేశం, అక్టోబర్ 27 -- ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన తెలుగు సినిమా ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. నల్గొండ కబడ్డీ ప్లేయర్ నిజ జీవిత కథతో వచ్చిన ఈ మూవీ పేరు 'అర్జున్ చక్రవర్తి'. థియేట్రికల్ రిలీజ్ కు ముందు ఈ మూవీ మంచి బజ్ క్రియేట్ చేసింది. కానీ అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఈ స్పోర్ట్స్ థ్రిల్లర్ కు ఆడియన్స్ జై కొడుతున్నారు.

తెలుగు స్పోర్ట్స్ థ్రిల్లర్ అర్జున్ చక్రవర్తి ఓటీటీలో సత్తాచాటుతోంది. రియల్ లైఫ్ స్టోరీతో వచ్చిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 24న ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ లో నంబర్ టూ ప్లేస్ లో ఉంది. ఈ సినిమాలో విజయ రామరాజు లీడ్ రోల్ ప్లే చేశాడు. దీనికి విక్రాంత్ రుద్ర డైరెక్టర్.

అర్జున్ చక్రవర్తి మూవీ నల్గొండ ...