భారతదేశం, మే 27 -- లేటెస్ట్ తెలుగు క్రైమ్ కామెడీ మూవీ చౌర్య‌పాఠం సెలైంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. ఐదు భాష‌ల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో అందుబాటులోకి వ‌చ్చింది. ఓవ‌ర్‌సీస్‌లో ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలో రిలీజైన ఈ మూవీ ఇండియాలో మాత్రం నెల రోజుల త‌ర్వాత ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

చౌర్య పాఠం మూవీలో ఇంద్ర‌రామ్‌, పాయ‌ల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా న‌టించారు. మ‌స్త్ అలీ, రాజీవ్ క‌న‌కాల‌, సుప్రియ ఐసోల కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈగ‌ల్ డైరెక్ట‌ర్ కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని క‌థ‌ను అందించిన ఈ మూవీని టాలీవుడ్ డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు న‌క్కిన నిర్మించారు. నిఖిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

చౌర్య పాఠం మూవీ కాన్సెప్ట్ డిఫ‌రెంట్‌గా ఉన్న క‌మ‌ర్షియ‌ల్‌గ...