భారతదేశం, జనవరి 3 -- భారతదేశంలో సైబర్ నేరాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా గడిచిన ఆరేళ్ల కాలంలో వివిధ రకాల ఆన్‌లైన్ మోసాలు, సైబర్ చీటింగ్ కేసుల వల్ల భారతీయులు ఏకంగా రూ. 52,976 కోట్ల కంటే ఎక్కువ సొమ్మును పోగొట్టుకున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని 'ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్' రిపోర్టు చేసిన తాజా గణాంకాలు ఈ విస్తుపోయే నిజాలను వెల్లడించాయి.

పెట్టుబడి ఉచ్చు, డిజిటల్ అరెస్ట్, ఆన్‌లైన్ స్కామ్‌లు, బ్యాంకింగ్ ఫ్రాడ్స్, సైబర్ ఫిషింగ్ వంటి నేరాలు దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయాయని ఈ నివేదిక హైలైట్​ చేసింది.

నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డేటా ప్రకారం.. కేవలం 2025 సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 21,77,524 ఫిర్యాదులు అందాయి. వీటి ద్వారా ప్రజలు సుమారు రూ. 19,812.96 కోట్లు నష్టపోయారు.

ఇన్వెస్ట్‌మెంట్ స్...