భారతదేశం, జనవరి 6 -- మియాపుర్ పోలీసులు ఓ దొంగను స్పాట్‌లోనే పట్టుకున్నారు. డయల్ 100కు కాల్ రావడంతో ఘటన స్థలానికి వెళ్లారు. అక్కడే ఉన్న దొంగను పట్టుకున్నారు. అయితే తెలిసిన మరో విషయం ఏంటంటే.. అతడు సైబర్ క్రైమ్ కోర్సులో కూడా శిక్షణ తీసుకుంటున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన వడ్డే కాటమయ్య సైబర్ క్రైమ్ కోర్సులో చేరేందుకు హైదరాబాద్‌ వచ్చాడు. శిక్షణ సమయంలో నేర్చుకున్న పద్ధతులను ఉపయోగించి ఏటీఎంల నుండి నగదు దొంగిలించడానికి ప్రయత్నించాడు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీసులు ఆదివారం రాత్రి ఏటీఎం నుండి డబ్బు దొంగిలిస్తుండగా నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులకు డయల్ 100 కాల్ వచ్చిన తర్వాత వెంటనే ఘటన స్థలానికి వెళ్లి అరెస్టు చేశారు.

'కాల్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఏటీఎం నుండి డబ్బు దొంగిలి...