Hyderabad, సెప్టెంబర్ 29 -- రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన రొమాంటిక్ చిత్రం 'శశివదనే'. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల శశివదనే సినిమాను నిర్మించారు.

శశివదనే సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న రిలీజ్ శశివదనే సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇవాళ (సెప్టెంబర్ 29) శశివదనే మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

'గల గల పారే గోదావరి గట్టుతో కళ కళలాడే అందమైన పల్లెటూరులో ఓ అమ్మాయిని చూడగానే తొలి చూపులోనే అబ్బాయికి ప్రేమ పడుతుంది. ప్రేమ ఆ చూపుతో మొదలైంది.. కాలం బొమ్మలా ఆగిపోయింది. ఆమెతో పాటే నా మనసు కూడా మాయమైంది' అనే డైలాగ్ హీరోయిన్‌పై హీరోకి ఉన్న లవ్ డెప్త్ ఏంటో చెబుతోంది.

'లంకలోని సీత కోసం రామ...