భారతదేశం, డిసెంబర్ 5 -- భారతదేశంలో తయారై ఆఫ్రికా మార్కెట్ల కోసం ఉద్దేశించిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారు.. గ్లోబల్ ఎన్​సీఏపీ క్రాష్ టెస్ట్‌లో అత్యంత పేలవమైన 'జీరో స్టార్' రేటింగ్‌ను పొందింది! ఈ హ్యాచ్‌బ్యాక్ కారు వయోజనుల రక్షణ విషయంలో సున్నా స్టార్లను, పిల్లల రక్షణ విషయంలో మూడు స్టార్లను మాత్రమే సాధించింది.

పాయింట్ల పరంగా చూస్తే, వయోజనుల భద్రత కోసం కేటాయించిన 34 పాయింట్లకు గాను ఈ కారు కేవలం 0 పాయింట్లు మాత్రమే నమోదు చేసింది. ఇక పిల్లల భద్రత కోసం కేటాయించిన 49 పాయింట్లకు గాను 28.57 పాయింట్లు సాధించింది.

కారు పిల్లల భద్రతలో కొంతవరకు మెరుగైన ఫలితాలు చూపించినప్పటికీ, వయోజనుల రక్షణ మాత్రం చాలా దారుణంగా ఉందని గ్లోబల్ ఎన్‌సీఏపీ పేర్కొంది. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాంతక గాయాలయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని టెస్ట్ నివేదిక హెచ్చరించింది.

ఫ్రెంటల్...