భారతదేశం, ఆగస్టు 11 -- బాలీవుడ్ తారలు దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, ఆలియా భట్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి టాప్ సెలబ్రిటీలకు పైలేట్స్ ట్రైనర్‌గా యాస్మిన్ కరాచీవాలా సుపరిచితురాలు. ఇటీవల భవిష్య సింధ్వానితో ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న యాస్మిన్.. సెలబ్రిటీలు తమ బిజీ షెడ్యూల్స్‌లోనూ ఎలా ఫిట్‌గా ఉంటారు, వారి వ్యాయామ విధానాలు ఎలా ఉంటాయో వివరించారు.

దీపిక, ఆలియా, కత్రినాల వ్యాయామ విధానాలు మిగతావారితో ఎలా భిన్నంగా ఉంటాయి అని అడిగినప్పుడు, యాస్మిన్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. "వారికి ఇతరులలో లేని ఒక గొప్ప లక్షణం ఉంది.. అదే క్రమశిక్షణ, అంకితభావం" అని అన్నారు. ప్రెగ్నెన్సీ తర్వాత దీపిక చాలా పైలేట్స్ చేసిందని యాస్మిన్ వెల్లడించారు. "ఆలియా, దీపికా... ఇద్దరూ అంతే. మీరు మరొకరి శరీరం లాగా తయారవ్వలేరు. కానీ మరొకరిలాగా ఫిట్‌గా ఉండగలరు" అని ఆమె చెప్ప...