Hyderabad, సెప్టెంబర్ 2 -- పితృపక్షానికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. ప్రతి ఏటా పితృపక్షం భాద్రపద పౌర్ణమి నుంచి మొదలవుతుంది. 15 రోజుల పాటు పితృపక్షం ఉంటుంది. ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ 7న మొదలవుతుంది, సెప్టెంబర్ 21తో ముగుస్తుంది. ఈ 15 రోజులు పాటు పితృ దేవతలను ఆరాధించడం వలన పితృ దేవతలు సంతృప్తి చెందుతారు. పితృదేవతల అనుగ్రహంతో మనం కూడా సంతోషంగా ఉండొచ్చు.

ఇది ఇలా ఉంటే పితృపక్షం సమయంలో ఒక చిన్న పరిహారాన్ని పాటిస్తే శుభఫలితాలను పొందవచ్చు. పితృపక్షం సమయంలో ఈ మొక్కలను నాటడం వలన జీవితంలో సానుకూల మార్పులు చూడొచ్చు. అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. పితృపక్షం సమయంలో నాటాల్సిన మొక్కలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

పితృపక్షం సమయంలో రావి మొక్కను ఇంట్లో నాటడం మంచిది. రావి మొక్కను పండగలు, పర్వదినాల సమయంలో పూజిస్తారు. పితృపక్...