Hyderabad, సెప్టెంబర్ 3 -- హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ 7, ఆదివారం నాడు వచ్చింది. ఆ రోజు స్నానం చేసిన తర్వాత సత్య నారాయణ స్వామిని ఆరాధించడం మంచిది. సత్యనారాయణ స్వామి కథ కూడా చదువుకోవచ్చు. భాద్రపద పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామిని పూజించడంతో పాటుగా లక్ష్మీదేవిని ఆరాధిస్తే కూడా మంచిది.

భాద్రపద పౌర్ణమి నాడు ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని, చంద్రుడిని పూజిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు. అదే రోజు తులసి పూజ చేస్తే కూడా విశేష ఫలితాలను పొందవచ్చు. తులసిని లక్ష్మీదేవిగా భావిస్తారు. భాద్రపద పౌర్ణమి నాడు తులసి మొక్క దగ్గర పూజ చేయడం వలన సంతోషం, ప్రశాంతత, ధనం, సంపద లభిస్తాయి. సమస్యలన్నిటిని తొలగించుకోవచ్చు.

లక్ష్మీదేవిని పౌర్ణమి నాడు పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. ఎవరికైనా అప్పులు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవారైనా పౌ...